ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన అదనపు కలెక్టర్‌

భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రిలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సతీమణి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడంతో కలెక్టర్‌ దంపతులను అందరూ ప్రశంసిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో కలెక్టర్ దంపతులను అభినందించారు. భూపాలపల్లి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్‌ కలెక్టర్ దంపతులకు కేసీఆర్ కిట్‌ను అందించారు.

Published : 05 Oct 2022 21:00 IST

మరిన్ని

ap-districts
ts-districts