‘ఆమెది హత్య కాదు ఆత్మహత్యే’: కొత్త మలుపు తిరిగిన ముంబయి హత్య కేసు

మహారాష్ట్రలో సహజీవన భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని ముక్కలుముక్కలు చేసిన హత్యోదంతంలో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. హతురాలు సరస్వతి వైద్య.. నిందితుడిని మామగా పరిచయం చేసేదని సమాచారం. తాను హత్య చేయలేదని, ఆమే ఆత్మహత్యకు పాల్పడినట్లు నిందితుడు మనోజ్‌ సానే పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. కేసులో ఇరుక్కుంటానన్న భయంతో ఆమె మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు.. కొన్ని శరీరభాగాలను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయటంతోపాటు మరికొన్నింటిని కుక్కర్‌లో వేసి ఉడికించినట్లు.. పోలీసుల విచారణలో నిందితుడు చెప్పినట్లు సమాచారం.

Updated : 09 Jun 2023 16:09 IST
Tags :

మరిన్ని