Krishna: ఒకేసారి 20 సినిమాలు.. కృష్ణ ఎలా చేస్తాడా అనుకున్నాం: మురళీ మోహన్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ నిర్మాతలకు శ్రేయోభిలాషి అని ప్రముఖ సినీనటుడు, ఆయన స్నేహితుడు మురళీమోహన్‌ చెప్పారు. కృష్ణతో తనకు 60 ఏళ్లకు పైనే అనుబంధం ఉందన్నారు. ఇద్దరం 1956లో ఏలూరులోని సీఆర్‌ రెడ్డి కాలేజ్‌లో ఇంటర్మీడియట్‌లో చేరామని గుర్తు చేసుకున్నారు. ఒకే రకమైన మనస్తత్వంతో ఆత్మీయంగా ఉండేవాళ్లమని మురళీమోహన్‌ వివరించారు. ఎప్పటికైనా థియేటర్‌ కట్టాలని, పడవలాంటి పెద్ద కారు కొనాలని అప్పట్లో కృష్ణ చెప్పేవారని.. ఆయన  అనుకున్నవన్నీ సాధించారన్నారు. ‘గూడఛారి 116’ సినిమాతో కృష్ణ సినీ కెరీర్‌ స్ట్రాంగ్‌ అయిందని.. ఆ సినిమా ఘన విజయం తర్వాత ఆయనతో సినిమా తీసేందుకు నిర్మాతలు పోటీపడ్డారని గుర్తు చేసుకున్నారు. దీంతో ఒకేసారి సుమారు 20 సినిమాల్లో నటించాలని కృష్ణకు అవకాశాలు వచ్చాయని వివరించారు. సినిమా విడుదల అయిన తర్వాత దాన్ని జడ్జ్‌ చేయడంలోఎవరైనా ఆయన తర్వాతే అని మురళీమోహన్‌ కొనియాడారు.

Updated : 15 Nov 2022 16:55 IST
Tags :

మరిన్ని