Viral Video: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మడం లేదు’: ఇంటి ముందు ఫ్లెక్సీ

‘మా ఇంట్లో ఓట్లు అమ్మడం లేదు’ అంటూ.. అనంతపురంలో ఓ ఇంటి ముందు ఫ్లెక్సీ వెలిసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు నల్లపల్లి విజయభాస్కర్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటును అమ్ముకొని.. ఆత్మగౌరవాన్ని, ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టలేమన్నారు. ఈ విషయాన్ని గట్టిగా తెలియజెప్పేందుకు ఫ్లెక్సీ కట్టినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ సరైన అభ్యర్థికి ఓటు వేయాలని, డబ్బులకు ఓటు అమ్ముకోవద్దని విజయభాస్కర్ సూచిస్తున్నారు.  

Published : 12 Mar 2023 19:00 IST

Tags :

మరిన్ని