Naga Chaitanya: సుధీర్‌ ఆల్‌రౌండర్‌ నటుడయ్యాడు: నాగచైతన్య

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘‘ఈమధ్య థియేటర్‌ ఏమైపోతోంది? ప్రేక్షకులు వస్తారా రారా? అంటూ అంతా  భయపడ్డారు. కథ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి సినిమాని ఆస్వాదిస్తారు. ఈ మధ్య సినిమాలు అదే విషయాన్ని నిరూపించాయి. ఈ సినిమా కూడా తప్పక విజయవంతం అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు.

Published : 14 Sep 2022 14:28 IST

Tags :

మరిన్ని