Rangabali Teaser: నవ్వులు పూయిస్తున్న నాగశౌర్య ‘రంగబలి’ టీజర్‌

నాగశౌర్య కథానాయకుడిగా ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. యుక్తి తరేజ కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గురువారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.  పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

Published : 08 Jun 2023 16:19 IST

Tags :

మరిన్ని