Yuvagalam: తెదేపా నేతలను కేసులతో వేధిస్తున్నవారికి చక్రవడ్డీతో చెల్లిస్తాం: లోకేశ్‌

తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సామాజిక భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా గుడుపల్లె మండలం బెగ్గిపల్లె ప్రజలతో సమావేశమైన లోకేశ్ అసంపూర్తిగా ఉన్న కురుబ భవనాన్ని పరిశీలించారు. ఆ పక్కనే ఉన్న వాల్మీకి భవనాన్ని కూడా చూశారు. వైకాపా వచ్చాక అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అలాగే తెలుగుదేశం నాయకులను కేసులతో వేధిస్తున్న వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

Updated : 28 Jan 2023 18:59 IST

మరిన్ని