Yevam: చాందిని చౌదరి, మోహన్ భగత్ జంటగా ‘యేవమ్’ ప్రారంభం

యువ నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న రెండో చిత్రం ‘యేవమ్’. కలర్ ఫొటో, సమ్మతమే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి, మోహన్ భగత్ జంటగా థ్రిల్లర్ కథాంశంతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిదానంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై  ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. పవన్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ చేసి త్వరలోనే విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Published : 22 Nov 2022 16:13 IST

మరిన్ని

ap-districts
ts-districts