Warangal: అన్నపూర్ణ అలంకారంలో వరంగల్‌ శ్రీ భద్రకాళి అమ్మవారు

వరంగల్‌ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై అమ్మవారిని ఊరేగించనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. 

Published : 27 Sep 2022 11:19 IST
Tags :

మరిన్ని