Naveen Polishetty: నటుణ్ని కావాలనే కోరిక వినాయక చవితి ఉత్సవాల్లోనే పుట్టింది: నవీన్‌ పొలిశెట్టి

నటుణ్ని కావాలనే కోరిక తనకు వినాయక చవితి ఉత్సవాల్లోనే పుట్టిందని యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తెలిపారు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతిని నవీన్ పొలిశెట్టి దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆయనకు ఉత్సవ సమితి సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాల్లో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న నవీన్ పొలిశెట్టి.. తన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విజయవంతమైనందుకు గణేశుడికి ప్రత్యేకంగా కృతజ్ఞలు తెలిపారు. 

Published : 18 Sep 2023 19:25 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు