Parliament New Building: కొత్త పార్లమెంట్ భవనం.. విశేషాలివే!

చట్టసభలు అంటే ప్రజాస్వామ్య దేవాలయాలు. ప్రజల వాణిని వినిపించే వేదికలు. ఆ భవన నిర్మాణ రూపాలు స్మరణకు వచ్చినంతనే దేశం పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేసే కట్టడాలు. అలాంటి చట్టసభల చరిత్రలో భారత్‌లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. పార్లమెంటు సమావేశాలు ఇక శాశ్వతంగా కొత్తగా నిర్మించిన భవనం (Parliament New Building)లోనే జరగనున్నాయి. ఇన్నాళ్లూ సమావేశాలు జరిగిన పాత పార్లమెంటు భవనం గత చరిత్రగా మిగిలిపోనుంది. మరి కొత్త భవనం విశేషాలు ఏమిటి? పాత భవనంతో పోలిస్తే దీని ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి? ఇన్నాళ్లూ లేనిది ఈ సమయంలోనే కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 

Published : 18 Sep 2023 22:29 IST

మరిన్ని