BalaKrishna: మార్చేయడానికి.. ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి: బాలకృష్ణ

విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్‌. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు. కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు. మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు.. పంచ భూతాలున్నాయ్‌.. తస్మాత్‌ జాగ్రత్త’’ అని బాలకృష్ణ హెచ్చరించారు.

Published : 24 Sep 2022 12:36 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని