Cobra: నాగుపాముకు తెల్లని రంగు.. వ్యక్తిపై కేసు నమోదు

కోబ్రా (Cobra)ను అరుదైన జాతికి చెందిన పాముగా చిత్రీకరించేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన ఒడిశా (Odisa)లో చోటు చేసుకుంది. ఒడిశాలోని స్నేక్ హెల్ప్ లైన్‌లో వాలంటీర్‌గా పనిచేసే అజయ్ కుమార్ దాస్.. నాగుపాముకు తెల్లని రంగు వేశాడు. అనంతరం దాని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి విదేశీ జాతికి చెందిన రకంగా ప్రచారం చేశాడు. తెల్లని రంగు కారణంగా నాగుపాము మనుగడకు ప్రమాదం పొంచి ఉందని స్నేక్ హెల్ప్ లైన్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రాణులు నాగుపామును తినేందుకు వస్తే సులభంగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితునిపై వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 01 Jun 2023 19:38 IST
Tags :

మరిన్ని