Chandrababu arrest: చంద్రబాబు అరెస్టు అక్రమం.. 70 ఏళ్ల వృద్ధురాలు కన్నీరు

చంద్రబాబు అరెస్టు దారుణమని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లిలో ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరిస్తూ....తెలుగుదేశం నేతలు బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా... ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 70ఏళ్ల సుందరమ్మ కన్నీరుపెట్టుకున్నారు. చంద్రబాబుని అరెస్ట్  చేసిన దగ్గర నుంచి నిద్ర పట్టడంలేదని...ఆహారం సహించడం లేదని చెప్పారు. 

Updated : 26 Sep 2023 14:29 IST
Tags :

మరిన్ని