Road Accident: బైక్‌ను తప్పించబోయి వాహనం బోల్తా.. వ్యక్తి మృతి

కరీంనగర్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పద్మానగర్ డెయిరీ వద్ద ఎలగందులకు చెందిన శ్రీనివాస్ బైక్‌పై డివైడర్ వద్ద మలుపు తిరుగుతుండగా.. అటుగా వస్తున్న బొలెరో వాహనం బైక్‌ను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ఘటనలో బొలెరోలోని జార్ఖండ్‌కు చెందిన అమిత్ మృతి చెందాడు. శ్రీనివాస్ గాయాలతో బయటపడ్డాడు. కాగా, ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది.

Updated : 06 Dec 2022 16:59 IST

మరిన్ని