National: "వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌"

ఒకే దేశం- ఒకే రేషన్! సుమారు మూడేళ్ల కిందటే కేంద్రం ఈ పథకం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా.. దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. లక్ష్యం ఐతే ఇదే కానీ.. మెుదట్లో కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయలేదు. దీంతో పేరుకే "వన్‌ నేషన్‌- వన్‌ రేషన్" కానీ... క్షేత్ర స్థాయిలో కథ వేరే ఉందనే విమర్శలు వినిపించాయి. ఐతే.. క్రమక్రమంగా మిగితా రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయడం మెుదలుపెట్టాయి. అలా.. చివరాకరికి అసోం రాష్ట్రం కూడా ఒకే దేశం- ఒకే రేషన్‌లో భాగస్వామ్యమైంది. దీంతో..పథకానికి పెట్టిన పేరు సార్థకమైందని ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేరు సార్థకమైంది సరే.. లక్ష్యం మాటేంటి..? ఇష్టం ఉన్నచోట లబ్దిదారులు సులభంగానే రేషన్ పొందగల్గుతున్నారా? ఏ చిక్కులు లేకుండానే వలస కార్మికులకు అన్ని రేషన్ సరుకులు అందుతున్నాయా..?

Published : 24 Jun 2022 15:40 IST

Tags :

మరిన్ని