Ori Devuda: దేవుడి పాత్రలో వెంకటేష్‌.. గ్లింప్స్‌ అదిరిందిగా..!

‘ఓరి దేవుడా’ చిత్ర బృందం ఓ సర్‌ప్రైజ్ గ్లింప్స్‌ను వదిలింది. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా, తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది.  మాతృకకి దర్శకత్వం వహించిన అశ్వథ్‌ మారిముత్తు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌ తెరపై దేవుడిగా సందడి చేయనున్నాడు. ఈ మేరకు వెంకటేష్‌ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 21న ‘ఓరి దేవుడా’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది.

Published : 21 Sep 2022 18:23 IST
Tags :

మరిన్ని