NTR: అది మా గొప్పతనం కాదు.. ‘జక్కన్న’దే: ఎన్టీఆర్‌

‘‘ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కిందంటూ చాలామంది గొప్పగా చెబుతున్నారు.. ఐతే, ఇది మా గొప్పతనం కాదు’’ అన్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌. ‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడారు. ‘‘మేం అమెరికా, జపాన్‌ వెళ్లామని, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుకకు వెళ్లామని గొప్పగా చెబుతున్నారు. ప్రేక్షకులు, అభిమానుల ఆశీర్వాదంతో పాటు తోటి నటీనటులు, కార్మికుల ప్రోత్సాహం, ప్రేమతో అక్కడికి వెళ్లాం. ముఖ్యంగా ఇది జక్కన్న (రాజమౌళి) విజయం. ఆయన మాకు ఆ పాత్రలను ఇచ్చారు కాబట్టే ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయి’’ అన్నారు.

Updated : 06 Feb 2023 16:33 IST

మరిన్ని