Pakistan: న్యాయ వ్యవస్థతో పాకిస్థాన్‌ సర్కారు ఢీ..!

ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టుతో అల్లకల్లోలమైన పాకిస్థాన్‌ (Pakistan)లో.. సంక్షోభం మరింత ముదురుతోంది. ఇమ్రాన్‌ను బెయిల్‌పై విడుదల చేసిన వ్యవహారం.. శాసన, న్యాయ వ్యవస్థ మధ్య యుద్ధానికి దారి తీసింది. మొన్నటి వరకూ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనలతో అట్టుడికిపోయిన దాయాది దేశం.. ఇప్పుడు ప్రభుత్వ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలతో అతలాకుతలం అవుతోంది. ఇమ్రాన్‌ను బెయిల్‌పై విడుదల చేసిన పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో.. షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు.

Published : 16 May 2023 18:32 IST

మరిన్ని