Nimmala Ramanaidu: తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ - పెరుగులంక గ్రామాల్లో దళితుల భూముల్లో వైకాపా నాయకుల అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ.. ఎమ్మెల్యే రామానాయుడు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ.. నిన్న రాత్రి చించినాడ గోదావరి ఏటిగట్టుపైనే నిద్రించి నిరసన తెలిపారు. ఇవాళ గ్రామస్థులతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతుండగా గోదావరి ఏటిగట్టు ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే నిమ్మలను బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే అరెస్టు సమయంలో తెదేపా నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Updated : 06 Jun 2023 17:12 IST

Nimmala Ramanaidu: తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు

మరిన్ని