Panchathantram: బ్రహ్మానందం ‘పంచతంత్రం’.. విడుదల తేదీ ఖరారు

బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. కలర్స్‌ స్వాతి, శివాత్మిక, రాహుల్ విజయ్, నరేశ్‌ ఆగస్త్య, దివ్య శ్రీప్రాద, సముద్రఖని నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. హర్ష పులిపాక దర్శకత్వంలో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మించిన ‘పంచతంత్రం’ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.

Published : 09 Oct 2022 16:59 IST

Tags :

మరిన్ని