వైకాపా సర్పంచ్‌ భర్త దాష్టీకం.. పంచాయతీ కార్యాలయంలో ఈవో గదికి తాళాలు!

ఎన్టీఆర్ (NTR) జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వైకాపా (YSRCP) సర్పంచ్ చింతల భూలక్ష్మి భర్త చింతల వెంకట్రావు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పంచాయతీ ఈవో రాణి ఆరోపించారు. మూలపాడులోని పంచాయతీ కార్యాలయంలో ఈవో గదికి సర్పంచ్ భర్త వెంకట్రావు  తాళాలు వేశారు. దీంతో ఆమె ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయలో విధులు నిర్వహిస్తున్నారు. బదిలీ అయ్యే వరకు ఇక్కడే పని చేస్తానని ఎంపీడీవోను కోరినట్లు రాణి తెలిపారు. ట్రెజరీకి కట్టాల్సిన సొమ్మును ఇవ్వనందుకే సర్పంచ్ భర్త తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. సర్పంచ్ భర్త వెంకట్రావు సుమారు రూ.10 లక్షలు తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు చెప్పారు. 

Updated : 29 May 2023 13:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు