Paritala Sunitha: సీకే పల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిటాల సునీత, శ్రీరామ్ నిరసన..

సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి (సీకే పల్లి) పోలీస్టేషన్‌ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం తెదేపా ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్, జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి నిరసనకు దిగారు.  వైకాపాకు చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేశారనే కారణంతో అర్ధరాత్రి సమయంలో స్థానిక తెదేపా నేత జగ్గును పోలీసులు అరెస్ట్‌ చేయడంపై వారు ఆందోళన చేపట్టి స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి అనుచితంగా మాట్లాడారని.. ఆయనపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని తెదేపా కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై పరిటాల సునీత, శ్రీరామ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తారా? రండి తేల్చుకుందాం అంటూ వైకాపా నేతలకు సవాల్‌ విసిరారు.

Updated : 27 Nov 2022 12:24 IST

Paritala Sunitha: సీకే పల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిటాల సునీత, శ్రీరామ్ నిరసన..

Tags :

మరిన్ని