Parliament: కొత్తగా 16 బిల్లులు ప్రవేశ పెట్టే యోచనలో కేంద్రం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈనెల 29 వరకూ జరిగే ఈ సమావేశాలపై గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని అంశాలపై సమాధానం చెప్పేందుకు సిద్ధమన్న కేంద్రం.. సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్ష భేటీలో కోరింది. 

Published : 06 Dec 2022 16:47 IST

మరిన్ని