Viral Video: కదులుతున్న రైలు ఎక్కబోయి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్న ప్రయాణికుడు

కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఓ ప్రయాణికుడి రైల్వే సిబ్బంది, ఇతర ప్రయాణికులు కాపాడారు. బిహార్‌లోని పట్నాలో.. మకోమా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. స్టేషన్ నుంచి అప్పుడే బయలుదేరిన రైల్లో ఎక్కేందుకు ప్రయత్నించిన బాధితుడు.. ప్లాట్ ఫాం, రైలు పట్టాలకు మధ్యలో పడిపోయాడు. అతడిని లగేజీ సహా కొంతదూరం వరకు రైలు లాక్కెళ్లింది. వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది, ఇతర ప్రయాణికులు.. బాధితుడిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Published : 08 Oct 2022 15:08 IST
Tags :

మరిన్ని