Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటన తలుచుకొని ప్రయాణికుల ఉద్వేగం!

ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident) గురించి తలచుకుంటేనే వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఆ పీడకల గురించి అడిగితే.. వారి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సాఫీగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా కుదుపులకు లోనై.. తాము ప్రయాణిస్తున్న బోగీలు బోల్తాపడ్డాయని చెప్పారు. స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నా.. తోటి ప్రయాణీకుల ఆర్తానాదాలు, చనిపోయినపోయినవారి మృతదేహాలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒడిశా రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగువారు ప్రత్యేక రైలులో స్వస్థలాలకు చేరుకున్నారు.

Updated : 04 Jun 2023 14:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు