PKSDT: ఆసక్తికరంగా పవన్‌కల్యాణ్‌ - సాయిధరమ్‌ తేజ్‌ మూవీ టైటిల్‌!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకుడు. గురువారం ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మేరకు దీనికి  ‘బ్రో’ (BRO) అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘వినోదాయ సిథం’ సినిమాకి ఇది రీమేక్‌.

Updated : 18 May 2023 16:23 IST

Tags :

మరిన్ని