Oparation Druva: ఇటుక బట్టీల వద్ద వెల్లివిరిస్తున్న అక్షర చైతన్యం

ఇటుక బట్టీల్లో అక్షర చైతన్యం మొదలైంది. తల్లిదండ్రులతో కలిసి బట్టీల్లోకి పనులకు వెళ్లకుండా చదువుకునేందుకు.. పెద్దపల్లి పోలీసులు ‘ఆపరేషన్ ధ్రువ’ పేరుతో పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. దశాబ్దాలుగా ఉపాధి కోసం తల్లిదండ్రులు వలస వస్తే వారితో వచ్చే చిన్నారుల బాల్యం బుగ్గిపాలవుతోంది. పలకా, బలపం పట్టాల్సిన చిట్టిచేతులు బట్టీల్లో ఇటుకలను పట్టే పరిస్థితి ఉండేది. దీనిని నివారిస్తూ ప్రస్తుతం పోలీసులు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి చిన్నారులు చదువుకునే ఏర్పాటు చేశారు.

Published : 26 Dec 2022 12:35 IST
Tags :

మరిన్ని