CM Jagan: పత్తికొండలో సీఎం జగన్‌ పర్యటన.. ప్రజలకు తప్పని తిప్పలు!

ముఖ్యమంత్రి పర్యటన అంటేనే ఏపీలో జనాలు హడలిపోతున్నారు. రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా పత్తికొండకు  సీఎం జగన్ (CM Jagan) వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలో దుకాణాలు మూయించారు. రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. పత్తికొండకు రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపేశారు. సీఎం సభకు వచ్చే వాహనాలు సైతం చాలా దూరంలోనే నిలిపేయటంతో.. ప్రజలు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతూ మండుటెండలో కాలినడకనే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Published : 01 Jun 2023 11:10 IST

మరిన్ని