YSRCP: గడపగడపలో.. వైకాపా ఎమ్మెల్యే దొరబాబుకి నిరసన సెగ

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకి నిరసన సెగ తగిలింది. యు కొత్తపల్లి మండలం అమినబాద్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏ ఇంటికెళ్లినా మహిళలు సమస్యలతో స్వాగతం పలికారు. రోడ్లు, మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలను విన్నవించారు. ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి గ్రామంలో విచ్చలవిడిగా సారా విక్రయాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. పూర్తిస్థాయిలో సారా కట్టడి చేస్తేనే వచ్చే ఎన్నికల్లో మీకు ఓటు వేసేదని, లేదంటే గ్రామంలో ఒక్కరితో కూడా ఓటు వేయించనని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే దొరబాబు సచివాలయానికి వచ్చిన గ్రాంట్‌తో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

Published : 22 Nov 2022 12:52 IST

Tags :

మరిన్ని