Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా పార్వతీపురంలో మహిళల నిరసన

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్‌ను ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మహిళలు కదం తొక్కారు. ‘బాబు కోసం మేము సైతం’ అంటూ మహిళలు పెద్దఎత్తున హాజరై భారీ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గం మహిళా విభాగం నాయకులు ద్వారపురెడ్డి శ్రీదేవి, సీతారాం నారాయణరావు పాత బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి తెదేపా శ్రేణులు, మహిళలు, పురుషులు ర్యాలీగా వెళ్లారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.

Updated : 23 Sep 2023 16:08 IST
Tags :

మరిన్ని