Free Petrol: ఉచితంగా పెట్రోల్‌.. భారీగా ఎగబడ్డ జనం!

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని స్థానిక పెట్రోల్ బంక్‌లో ఉచిత పెట్రోల్ (Free Petrol) కోసం వాహన చోదకులు ఎగబడ్డారు. ఓ వ్యక్తి దీన్ని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రచారం చేయడంతో భారీ ఎత్తున జనం తరలివచ్చారు. రెండు లీటర్ల పెట్రోల్/డీజిల్ కూపన్లను 150 మందికి పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు తండోపతండాలుగా బంక్‌కు చేరుకున్నారు. పోలీసులు వీరిని నియంత్రించి.. కూపన్లను పంపిణీ చేయించారు. 

Updated : 25 May 2023 19:50 IST

Tags :

మరిన్ని