Viral Video: సీపీఆర్‌ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. వీడియో వైరల్‌

సమయానికి సీపీఆర్‌, ప్రథమ చికిత్స చేసి పోలీసులు ఓ వ్యక్తి ప్రాణాలు నిలిపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1లో ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని వ్యక్తి.. కరెంట్‌ పోల్‌ విద్యుత్‌ బాక్స్‌లో చేయి పెట్టి స్పృహ కోల్పోయాడు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ రాకేశ్‌ రెడ్డి, సిబ్బంది ఇది గమనించి వేగంగా స్పందించారు. వెంటనే ప్రథమ చికిత్స, సీపీఆర్‌ చేసి.. అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, వ్యక్తి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. 

Published : 22 Nov 2022 19:21 IST
Tags :

మరిన్ని