Bhuma Akhilapriya: భూమా అఖిలప్రియ నిరవధిక నిరాహార దీక్ష భగ్నం

నంద్యాలలో తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhilapriya) చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసు వాహనంలో ఆమెను ఆళ్లగడ్డకు చేర్చి ఇంటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా అఖిలప్రియ నిరాకరించారు. తన దీక్ష భగ్నం కాలేదని పోలీసులు అనుమతి ఇవ్వకుంటే వాహనంలోనే తన దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు. ఇంటి బయటే కూర్చుని నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆమె తెలిపారు. తన హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు.   

Updated : 23 Sep 2023 10:58 IST
Tags :

మరిన్ని