BRS: వేడెక్కిన కారు ఇంజిన్‌.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆధిపత్య పోరు

అసెంబ్లీ ఎన్నికల పోరుకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో అధికార భారాసతోపాటు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. అయితే జిల్లాలో అంటీముట్టనట్లున్న నేతల మధ్య ఐక్యత, కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ప్రచ్ఛన్న పోరు భారాసకు తలనొప్పిగా మారాయి. వచ్చే ఎన్నికల్లో సీటు తమదేనంటూ నాయకులు ఎవరికి వారే నియోజకవర్గాలు చుట్టేస్తుండటం భారాసలో మరింత కాక పుట్టిస్తోంది.

Published : 17 Mar 2023 13:20 IST

Tags :

మరిన్ని