D Srinivas: సీనియర్ నేత డి.శ్రీనివాస్ కుటుంబంలో రాజకీయ విభేదాలు!

సీనియర్ నేత డి.శ్రీనివాస్(D Srinivas) కాంగ్రెస్(Congress) పార్టీలో చేరిక అంశం.. ఆయన కుటుంబంలో చిచ్చు రేపింది. పెద్దకుమారుడు సంజయ్‌తో కలిసి హస్తం కండువా కప్పుకొన్న ఒక్కరోజులోనే.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు డీఎస్‌ లేఖ పంపించారు. ఐతే ఈ లేఖ తన తండ్రి పంపలేదని.. దీని వెనుక ఎంపీ అర్వింద్(MP Arvind) హస్తం ఉందని సంజయ్ ఆరోపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అర్వింద్ మాత్రం ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Published : 28 Mar 2023 09:24 IST

Tags :

మరిన్ని