Pope Francis: ఆస్పత్రిలో చేరిన పోప్‌ ఫ్రాన్సిస్‌..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis).. ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ (Respiratory Infection)తో పోప్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో చేరారని.. చాలా రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వాటికన్ వెల్లడించింది. 86 ఏళ్ల పోప్‌కు కరోనా వైరస్ సోకలేదని వాటికన్ సిటీ ప్రతినిధి మాటియో బ్రూనీ స్పష్టం చేశారు. 2021 జూలైలో పెద్దపేగు సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన పోప్.. తర్వాత మళ్లీ చేరడం ఇదే తొలిసారి. 

Updated : 30 Mar 2023 17:40 IST
Tags :

మరిన్ని