Prabhas: ఏం చెబుతున్నావ్‌ డార్లింగ్‌.. బాలయ్య షోలో ప్రభాస్‌ సందడి

హైదరాబాద్‌: బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ -2’ (unstoppable-2). ఆహా వేదికగా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ కార్యక్రమంలో తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) సందడి చేశారు. తన స్నేహితుడు, నటుడు గోపీచంద్‌తో (Gopichand) కలిసి బాలయ్య షోలో పాల్గొన్న ఆయన.. ఎన్నో విశేషాలు పంచుకున్నారు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ తాజాగా విడుదలైంది. ఇందులో బాలయ్య అడిగిన ప్రశ్నలకు ప్రభాస్‌ నవ్వులు పూయిస్తూ సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

Published : 14 Dec 2022 08:07 IST
Tags :

మరిన్ని