TS News: అధికారులకు బదులుగా.. ‘ప్రజావాణి’లో డబ్బాలు!

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం అధికారులు లేక వెలవెల బోయింది. కలెక్టర్ రాహుల్ రాజ్‌తో సహా జిల్లా అధికార యంత్రాంగం.. దశాబ్ది వేడుకల సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వీసీలో ఉండటంతో.. ప్రజావాణి వైపు వారెవరూ రాలేదు. అధికారులు రారని ముందే తెలిస్తే.. వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే వారం కాదని అర్జీదారులు వాపోయారు. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలో జరగాల్సిన ‘ప్రజావాణి’ని అధికారులు రద్దు చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద ఒక డబ్బా ఏర్పాటు చేసి అందులో అర్జీదారులు దరఖాస్తులు వేసేలా ఏర్పాటు చేశారు. అయితే, ఈ విషయం తెలియక చాలా మంది కలెక్టరేట్‌కు వచ్చారు.

Published : 29 May 2023 19:13 IST
Tags :

మరిన్ని