Tirumala: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. మాడవీధుల్లోకి సీఎంవో వాహనం!

తిరుమల(Tirumala)లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో సీఎంవో వాహనం చక్కర్లు కొట్టింది. దానిపై సీఎం కార్యాలయానికి సంబంధించిన వాహనంగా సూచించే స్టిక్కర్లు ఉన్నాయి. మాడవీధుల్లో ప్రైవేటు వాహనాల రాకపోకలకు తితిదే అనుమతి నిషేధించింది. ఇటీవల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్‌ దృశ్యాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. 

Updated : 31 Jan 2023 16:50 IST
Tags :

మరిన్ని