Cinema news: సమ్మెనోటీసులు రాలేదు.. సినిమా షూటింగ్‌ చేసుకోండి: ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు

సినీ కార్మికుల సమ్మె ప్రకటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ స్పందించారు. పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందే ఫిల్మ్ ఛాంబర్‌కు నోటీలివ్వాలన్నారు. అలాంటి నోటీసులేమీ రాలేదని, నిర్మాతలు రేపు సజావుగా షూటింగ్ జరుపుకోచ్చని రామకృష్ణ వెల్లడించారు. సినీ కార్మికుల వేతనాలపై రేపు నిర్మాతల వాణిజ్య మండలి, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు.

Published : 21 Jun 2022 20:51 IST

Tags :

మరిన్ని