Pakistan - Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌తో పాకిస్థాన్‌లో ఆందోళనలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని... పాకిస్థాన్‌ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో దాయాది దేశంలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పీటీఐ శ్రేణులు, ఇమ్రాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దిగారు. కొందరు ఆందోళనకారులు రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై దాడికి దిగారు. లాహోర్ లోనూ కోర్ కమాండర్ నివాసంపై దాడి చేశారు. హింసాత్మక ఘర్షణల్లో నలుగురు PTI కార్యకర్తలు మరణించారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని ఆ పార్టీ వెల్లడించింది.

Updated : 10 May 2023 11:39 IST

మరిన్ని