జగిత్యాలలో ప్రోటోకాల్‌ వివాదం.. మంత్రి ఉండగానే శిలాఫలకం తొలగింపు

జగిత్యాల జిల్లాలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్, మందుల గిడ్డంగి నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంతతో పాటు జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరయ్యారు. శిలాపలకంపై జడ్పీ ఛైర్‌పర్సన్‌ పేరు లేకపోవడంతో.. జిల్లా అధికారులపై ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మండిపడ్డారు. దీంతో శిలాఫలకాన్ని తొలగించి పేరు చేర్చి తిరిగి బిగించాలని కొప్పుల ఆదేశించారు. దీంతో శంకుస్థాపన అయిన వెంటనే శిలాఫలకాన్ని తొలగించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మధ్య విభేదాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

Published : 04 Jun 2023 19:27 IST

Tags :

మరిన్ని