Avatar: కొబ్బరి పీచుతో అవతార్‌ బొమ్మలు

బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్న ‘అవతార్ - ది వే ఆఫ్ వాటర్’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని.. ఇద్దరు విద్యార్థులు రూపొందించిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పుదుచ్చేరిలో సెలియమేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సంతోష్, నవనీత్ కృష్ణ.. అవతార్  సినిమాలో పాత్రలను పోలిన బొమ్మలను రూపొందించారు. నేతిరి, జేక్‌ల బొమ్మలను కొబ్బరి చిప్పలు, మందార ఆకులు, తాటి ఆకులు వంటి సహజసిద్ధంగా దొరికే వ్యర్థాలతోనే తయారుచేశారు. 

Published : 21 Dec 2022 12:40 IST

Tags :

మరిన్ని