Bhagwant Mann: ఇంట్లోనే నిరాడంబరంగా పంజాబ్‌ సీఎం వివాహం

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హరియాణాకు చెందిన డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లాడారు. ఎటువంటి బాజా భజంత్రీలు, హంగు ఆర్భాటాలు లేకుండా చండీగఢ్‌లోని సెక్టార్‌ 2లో గల సీఎం నివాసంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం మాన్‌.. కౌర్‌ను పెళ్లి చేసుకొన్నారు.

Published : 07 Jul 2022 16:32 IST

Tags :

మరిన్ని