విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న పురంధేశ్వరి, నందమూరి సుహాసిని

నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్న తండ్రి మోహన కృష్ణ, పురంధేశ్వరి, నందమూరి సుహాసిని ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. నందమూరి అభిమానులు భారీగా తరలిరావడంతో నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. నిన్న కుప్పంలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే.

Updated : 28 Jan 2023 20:16 IST

మరిన్ని