TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్తకోణం

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. నాలుగో రోజు కస్టడీలో భాగంగా నిందితుల నుంచి పోలీసులు మరిన్ని కీలక ఆధారాలను సేకరించారు. వారి కాల్ డేటా, వాట్సప్ గ్రూపులు, చాటింగ్ ఆధారంగా ఎవరెవరితో మాట్లాడారనే అంశంపై తీగలాగుతున్న సిట్.. వీరిలో గ్రూప్ -1 ప్రిలిమినరీ రాసి, ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితా రూపొందిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మినీ సిట్  కార్యాలయంలో విచారించారు.

Published : 22 Mar 2023 09:45 IST

Tags :

మరిన్ని