Jaishankar: విదేశాల్లో దేశంపై విమర్శలు చేయటం రాహుల్‌కు అలవాటే: జైశంకర్

కెనడా భూభాగం నుంచి భారత్ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించటాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తప్పుపట్టారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు, కెనడాకు మంచిది కాదన్నారు. బ్రామ్టాన్ నగరంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతంపై సంబరాలు చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంపై ఈ మేరకు స్పందించారు. కెనడాలో ద్వేషానికి, హింసకు చోటులేదని, అలాంటి చర్యలను ఖండిస్తున్నట్లు జైశంకర్ చెప్పారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసకు పాల్పడేవారిని అనుమతించటం వెనుక అంతర్లీనంగా పెద్దకుట్రఉందని భావిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో దేశం గురించి విమర్శలు చేయటం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అలవాటు అని జైశంకర్ విమర్శించారు.  

Published : 08 Jun 2023 21:34 IST

Tags :

మరిన్ని