Rains: రాగల ఐదు రోజులు.. ఉరుములు, మెరుపులతోపాటు వడగళ్ల వాన..!

తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతోపాటు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఉత్తర - దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయన్నారు. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.   

Updated : 23 Mar 2023 16:16 IST

Tags :

మరిన్ని