Protest: రాత్రంతా మేత పెట్టలేదు.. కార్యాలయానికి గాడిదలను తోలుకొచ్చిన రజకులు

కర్నూలు నగరపాలక సంస్థ అధికారుల తీరుకు నిరసనగా రజకులు గాడిదలతో ధర్నా చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోకి గాడిదలు తీసుకుని వచ్చి ఆందోళన చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని అధికారులు.. గురువారం రజకులకు చెందిన గాడిదలను తీసుకెళ్లి ఆహారం పెట్టకుండా రాత్రికి విడిచిపెట్టారని ఆరోపించారు. ఈ ఘటనలో  రెండు గాడిదలు చనిపోగా, మరో రెండింటికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. దోబీ ఘాట్లతో పాటు గాడిదల నివాసానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు..

Published : 30 Sep 2022 16:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు